: ఐబీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా పీవీ సింధు
ప్రతిష్టాత్మక ఇండియన్ బ్యాడ్మింటన్ సెలెబ్రిటీ లీగ్ (ఐబీసీఎల్)కు యువ క్రీడాకారిణి పీవీ సింధు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది. ఆగష్టులో చెన్నైలో నిర్వహించే ఈ టోర్నీకి తమిళ చిత్ర పరిశ్రమ మద్దతిచ్చింది. ఈ టోర్నీకి సంబంధించిన వివరాలను చెన్నైలో నిర్వాహకులు వెల్లడించారు. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ లీగ్ జరుగుతుందని టోర్నీ డైరెక్టర్ హేమచంద్రన్ చెప్పారు.