: అవును, ఆయన నాయుడు, నేను నాయుడే...అయితే ఏం?: వెంకయ్యనాయుడు
ప్రజల్లో విద్వేషాలు రేకెత్తించడానికి కొంత మంది 'ఆయన నాయుడు, ఈయన నాయుడు' అంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య మండిపడ్డారు. 'అవును... ఆయన నాయుడే నేను నాయుడే...అయితే ఏం?' అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు అయిపోయాయి... ఇంకా విద్వేషాలు రేకెత్తించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మొదట భారతీయుడినని, ఆ తరువాత తెలుగు వాడినని... భాష వేరైనా, యాస వేరైనా మనం అన్నదమ్ములమని ఆయన గుర్తు చేశారు. మనలో మనం కొట్టుకోవడం కంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని ఆయన అన్నారు.