: ప్రతి భారతీయుడు తలెత్తుకునేలా దేశాన్ని పాలిస్తాం: వెంకయ్యనాయుడు
ప్రతి భారతీయుడు తలెత్తుకునేలా దేశాన్ని పరిపాలిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మోడీ అంటే త్రీడీ (డెవలెప్ మెంట్, డైనమిక్, డెసిషన్ ) అని నిరూపించారని అన్నారు. మోడీ మేలు చేస్తాడని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అలాంటి ప్రజలకు మంచి చేయాలంటే బీజేపీ కార్యకర్త దగ్గర నుంచి నేత వరకు అందరూ ఆదర్శంగా నిలవాలని అన్నారు.
ఈ సారి దక్షిణాదిన 39 స్థానాలు గెలిచి బీజేపీ సత్తా చాటిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాలూనిందని, అందుకు కారణమైన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు అని తెలిపారు. దేశం నిండా సవాళ్లు ఉన్నాయని అన్నారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.