: హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాదు చేరుకున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేసిన బాబు ఇవాళ పలువురు అధికారులతో సమావేశమై విభజన ప్రక్రియ పురోగతిపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాణ స్వీకార ఏర్పాట్ల గురించి కూడా పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.