: ఎన్టీఆర్ కాదు.. చంద్రబాబు ఫొటోతో వెళ్లండి : లక్ష్మీపార్వతి


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఫొటో పెట్టుకునే అర్హత ఇప్పటి తెలుగుదేశం పార్టీకి లేనేలేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ ఫొటోతో కాకుండా చంద్రబాబు ఫొటోతో ప్రజల్లోకి వెళ్లండని ఆమె తెలుగుదేశం పార్టీనేతలకు సవాల్ విసిరారు. ఎన్టీఆర్ బ్రతికుండగానే బావ పదవిలాక్కుంటే, మారు మాట్లాడకుండా బావపక్కన నిలబడ్డ బాలకృష్ణ, ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటో విషయంలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అభిమానులు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే తప్పులేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు లక్ష్మీ పార్వతి బాసటగా నిలిచారు.

  • Loading...

More Telugu News