: బేగంపేట ఎయిర్ పోర్టులో వెంకయ్యకు ఘన స్వాగతం
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు తొలిసారి హైదరాబాదుకు వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనను పూలమాలలతో ముంచెత్తారు. తలపాగాలు చుట్టి, శాలువాలతో సత్కరించారు. అనంతరం భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వారంతా బీజేపీ కార్యాలయానికి బయల్దేరారు.