: విజయవాడ, విశాఖల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు: వెంకయ్య నాయుడు
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఐఐటీ, ఐఐఎం సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇవాళ తిరుపతికి వచ్చిన వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో సీమాంధ్రుల భద్రతకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆయన అన్నారు.