: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎస్ మహంతి భేటీ
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ ముగిసింది. కేంద్రం నిర్ణయం ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఉద్యోగ సంఘాలకు సీఎస్ తేల్చి చెప్పారు. మూడు నెలల పాటు కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
జూన్ 1 అర్థరాత్రికే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే జూన్ 2 నుంచి 9 వరకు తెలియజేయాలని ఆయన అన్నారు. ముందుగా సచివాలయం, హెచ్ వోడీ, ఆఫీసులు, జోనల్ పోస్టులకు సంబంధించి అభ్యంతరాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.