: భారతరత్న ఇవ్వండి... లేకపోతే పార్లమెంటు ఎదుట ధర్నా చేస్తా: లక్ష్మీపార్వతి
తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంటు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ రోజు శ్రీకాళహస్తిలో ఆమె రాహు, కేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదల కోసం ఎంతో చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.