: నీలేకని మళ్లీ ఇన్ఫోసిస్ లోకి రావాలి: మోహన్ దాస్


ఇన్ఫోసిస్ కంపెనీలోకి నందన్ నీలేకని మళ్లీ తిరిగి రావాలని కంపెనీ ముఖ్య ఆర్థిక విభాగం హెడ్ (సీఎఫ్ఓ) మోహన్ దాస్ పాయ్ బహిరంగంగా కోరారు. కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్న కంపెనీకి ఆయన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్న నీలేకని, యూపీఏ సర్కారు చేపట్టిన ఆధార్ కార్డుల ప్రాజెక్టు చైర్మన్ పదవి కోసం కంపెనీ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఇన్ఫోసిస్ చైర్మన్ గా నారాయణమూర్తి 2013 జూన్ లో మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత టాప్ పోస్టుల్లో ఉన్నవారు ఒక్కొక్కరే రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కంపెనీ బోర్డు డైరెక్టర్ బీజీ శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. దీంతో మోహన్ దాస్ పాయ్ నీలేకనిని ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరుగా నీలేకనిపై బాధ్యత ఉంది. కంపెనీ కోసం ఆయనెంతో కృషి చేయగా, కంపెనీ కూడా ఆయనకు ఎంతో ఇచ్చింది. ఏడాది రెండేళ్లపాటు కంపెనీ కోసం నీలేకని సేవలు అందించాలి, చైర్మన్ మూర్తికి సహకరించాలి' అని పాయ్ కోరారు.

  • Loading...

More Telugu News