: ఒత్తిడితో వీర్యానికి దెబ్బ
మానసిక ఒత్తిడి పెరిగిపోతోందా? అయితే వెంటనే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా పురుషులకు ఇది అవసరం. ఎందుకంటే, మానసిక ఒత్తిడి వీర్య నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఒత్తిడి ఉంటే ఆ ప్రభావం వీర్య గాఢత, అండంతో శుక్రకణాల ఫలదీకరణంపై చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సంతాన సాఫల్యత కూడా తగ్గిపోతుందట. కనుక రిలాక్స్ అవ్వండి.