: ఆర్టికల్ 370ని ముట్టుకోవద్దు: బీహార్ సీఎం హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు, స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను ముట్టుకోవద్దని బీహార్ సీఎం జితన్ రామ్ మంజి కేంద్ర సర్కారుకు హితవు పలికారు. దాన్ని ఎత్తివేయాలని చూస్తే మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను ఇచ్చారని, దాన్ని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఒకవేళ తొలగించాలనుకుంటే అది పెద్ద ప్రమాదకర నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు. 370వ అధికరణ విషయంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పింది నిజమేనన్నారు.