: ఉమాభారతితో ముగిసిన చంద్రబాబు భేటీ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా హాజరయ్యారు. సమావేశం సందర్భంగా పోలవరంకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు... సీమాంధ్రలోని పలు ప్రాజెక్టులకు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి ఉమాభారతి సానుకూలంగా స్పందించారు.