: సీమాంధ్ర పునర్నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం: జైట్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ రోజు తనతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లులో పొందుపరచిన అన్ని అంశాలను అమలు చేస్తామని... సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. సీమాంధ్రకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీపై ఇప్పటికే ప్రణాళిక సంఘం కసరత్తులు మొదలు పెట్టిందని తెలిపారు.