: జైట్లీతో ముగిసిన సమావేశం... చంద్రబాబుతో పాటు హాజరైన జైరాం రమేష్
కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీకి సీమాంధ్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు వివరించారు. రుణ మాఫీ, సీమాంధ్ర లోటు బడ్జెట్ అంశాలను కూడా తెలియజేశారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు. ఉత్తరాఖండ్ తరహాలో ఆర్థిక, పారిశ్రామిక ప్రత్యేక ప్యాకేజ్ ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 13, 14 ఫైనాన్స్ కమిషన్లలో కూడా సీమాంధ్రకు పెద్దపీట వేయాలని కోరారు. యూపీఏ హయాంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని... ఎన్డీయే హయాంలో ఆ లోటును పూడ్చాల్సిన అవసరం ఉందని జైట్లీకి విన్నవించారు.