: కేసీఆర్ లేఖ వల్లే అప్పట్లో కాంగ్రెస్ ఆర్డినెన్స్ ఆపింది: హరీష్ రావు
ఆర్డినెన్స్ కు వ్యతిరేకమని తాము ముందే చెప్పామని హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి లేఖ రాయడం వల్లే అప్పట్లో ఆర్డినెన్స్ జారీ చేయలేదని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెస్తే బీజేపీ దానిని ఆపి ఉండేదని ఆయన తెలిపారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కనుక బీజేపీ వెంటనే ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరుగనుండగా, హడావుడిగా ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.