: పెళ్లి పేరిట అమ్మాయిలను దోచుకుంటున్న మాయగాడు!
మోసగాడు అనే పదం కూడా సిగ్గుపడే ఘరానా మోసగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్లి పేరుతో 55 మంది మహిళలను మోసం చేశాడు. వివాహ వెబ్ సైట్ లో తన పేరు నమోదు చేసుకుని, సంబంధం కోసం డబ్బులు చెల్లించి యువతుల వివరాలు సంపాదించేవాడు. వారితో పరిచయం పెంచుకుని ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వారి బంగారు ఆభరణాలు, నగదు కాజేసి వారిని ముంచుతున్నాడు. అతడిపై పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వలపన్ని మోసగాడిని అరెస్టు చేశారు.