: సీఎం చాలా సాహసవంతులట....!


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాహసవంతులని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పొగడ్తలతో ముంచెత్తారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారు బిల్లు చెల్లించనక్కరలేదని తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సాహసంతో కూడుకున్న చారిత్రాత్మక నిర్ణయమని చెప్పుకొచ్చారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ పాతబకాయిలు రద్దు చేసినందుకు ఆయన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాది హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 15వందల కోట్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

  • Loading...

More Telugu News