: కేసీఆర్ మరో కేజ్రీవాల్ అవుతావ్... యూటీ కోసం డిమాండ్ చేస్తాం: సోమిరెడ్డి


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 2004లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైందని... అప్పుడు మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని... లేకపోతే మరో కేజ్రీవాల్ అవుతాడని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాదులో టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని... టీడీపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. హైదరాబాదును యూటీ చేయాలని తాము డిమాండ్ చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News