: మంత్రులకు 10 సూత్రాలను నిర్దేశించిన మోడీ
అత్యున్నత రీతిలో పనిచేసి మంచి ఫలితాలను రాబట్టాలని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. వృత్తి నిర్వహణలో మీడియా పట్ల జాగ్రత్తగా మసలుకోవాలని చెప్పారు. మంత్రుల ముందు 10 సూత్రాలను ఉంచి తుచ తప్పకుండా పాటించాలని హితవు పలికారు. బంధుప్రీతి అసలు ఉండరాదంటూ సూచించారు. మోడీ 10 సూత్రాలు ఇవే....
1. మంత్రులందరూ సమన్వయంతో పనిచేయాలి.
2. పాలనలో పారదర్శకత ఉండాలి.
3. ప్రజలతో సంబంధాలను కలిగి ఉండటానికి... సాంకేతికతను, సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి.
4. సుపరి పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
5. విద్య, వైద్య, మౌలిక వసతుల అభివృద్ధి కీలకం.
6. ఈ-టెండర్ల ద్వారా పనులను కేటాయించాలి.
7. పథకాలను సకాలంలో పూర్తి చేయాలి.
8. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం సంస్కరణలు.
9. సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.
10. అధికారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం.