: విద్య, వైద్యం, తాగునీరు, రహదార్లకు ప్రాధాన్యం: వెంకయ్య
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్య, వైద్యం, తాగునీరు, రహదార్లకు ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పరిపాలన, పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. దాంతో, ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకువస్తామన్నారు. వంద రోజులకు ఒకసారి ప్రతి మంత్రీ తన శాఖ చేసిన పనులపై ప్రగతి నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, పెట్టుబడి విధానాల్లో మార్పు తీసుకువస్తామని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.