: విభజన సమయంలో ముస్లింలపై కాల్పులు ఏంటి?: అసదుద్దీన్ ఒవైసీ


రాష్ట్ర విభజన సమయంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కాల్పులు జరపడం సరికాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాదులో గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజేంద్రనగర్ లో కాల్పులకు దిగారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. నిజానిజాలు వెలికితీసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News