: రాహుల్ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టాలి: దిగ్విజయ్
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్ బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కోరారు. కాంగ్రెస్ కు నాయకత్వం వహించాలంటే, రాహుల్ పార్లమెంటులో పార్టీని నడిపించాలని, ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించాలని అన్నారు. పార్టీని ముందుండి నడిపించాలంటే రాహుల్ ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.