: శ్రీవారి పాదాలకు బంగారు తొడుగులను బహూకరించిన భక్తుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదాలకు ఓ భక్తుడు బంగారు తొడుగులను బహూకరించాడు. కిలో బంగారంతో వీటిని తయారుచేయించినట్లు విశాఖపట్నానికి చెందిన భక్తుడు శ్రీనాథ్ తెలిపారు. రూ.30 లక్షల విలువైన ఈ తొడుగులను ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారికి సమర్పించారు.