: ఔటర్ రింగు రోడ్డుపై మహిళను కత్తులతో పొడిచి చంపిన ఆగంతుకులు
బుధవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన హైదరాబాదు శివారు హిమాయత్ సాగర్ లో చోటు చేసుకుంది. మహిళను కత్తులతో విచక్షణారహితంగా పొడిచిన ఆగంతుకులు ఆమెను ఔటర్ రింగ్ రోడ్డుపై పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. మహిళపై ఆగంతుకులు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్యాయత్నం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.