: పోలవరం విషయంలో ఎన్డీఏ కొత్తగా చేసిందేమీ లేదు: అశోక్ గజపతిరాజు


పోలవరంలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి నిన్న (బుధవారం) ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. యూపీఏ హామీని ఎన్డీఏ కొనసాగించిందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, కొందరు రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ గ్రామాలను ఆంధ్రలో ఉంచడమే న్యాయమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి హోదాను పదేళ్లకు పెంచాలని ఢిల్లీలో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News