: వేసవి రద్దీ దృష్ట్యా నాలుగు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు
వేసవి రద్దీ దృష్ట్యా నాలుగు జన్ సాధారణ్ రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాదు, విజయవాడ, కాకినాడ మార్గంలో ఈ రైళ్లను నడపనున్నట్లు ద.మ. రైల్వే ప్రకటించింది. మే 30 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఈ జన్ సాధారణ్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి.