: నేతలైనా, వ్యాపార వేత్తలైనా నన్ను టచ్ చేయలేరు: జస్టిస్ ఎంబీ షా


రాజకీయ నాయకులైనా, వ్యాపారవేత్తలైనా, ప్రముఖులైనా ఎవరైనా సరే తనను టచ్ చేయలేరని నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఛైర్మన్ జస్టిస్ ఎంబీ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించానని, విధినిర్వహణలో ఇంతవరకు ఎవరితోనూ వేలెత్తి చూపించుకునే పని చేయలేదని అన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News