: టీమిండియా కొత్త కెప్టెన్ రైనా
భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ను సెలెక్టర్లు నియమించారు. మూడు వన్డేల బంగ్లాదేశ్ టూర్ కు సురేష్ రైనాను కెప్టెన్ గా నియమిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ధోనీ, కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ రహానే, పుజారా, ఊతప్ప, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐపీఎల్ లో విశేషంగా రాణించిన ఊతప్పకు మరోసారి టీమిండియా జట్టులో చోటు దక్కింది.