: ఢిల్లీలో సోనియాను కలసిన డీఎస్
పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. తెలంగాణలో పార్టీ ఘోర పరాజయంపై నివేదిక అందించారు. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత డీఎస్ మాట్లాడుతూ, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ను ప్రజలు గుర్తించారని, ఆ ప్రభావంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిందని విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందని డీఎస్ ఒప్పుకున్నారు.