: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైన వైసీపీ
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యంపై సమీక్షించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి ఈ కమిటీలు జిల్లాల్లో తిరిగి క్షేత్ర స్థాయిలో నివేదికలు రూపొందిస్తాయి. కమిటీల నివేదికల ఆధారంగా అధినేత జగన్ జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు.