: ఖమ్మంలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలపొద్దు: ఎంపీ వినోద్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపొద్దని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఢిల్లీలో హోంశాఖ ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఆ మండలాలను ఆంధ్రాలో కలపాలని కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తెస్తోందని ఆయన మీడియాతో అన్నారు. అందుకే హోంశాఖ ప్రతినిధులను కలిసినట్టు చెప్పారు. తెలుగుదేశం కుట్రలను అడ్డుకుంటామని తెలిపారు.