: ముందస్తు ఎన్నికలు రానే రావు : సీతారాం ఏచూరి


దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రేగుతున్న దుమారంపై సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి స్పందించారు. సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీ లు ముందస్తు ఎన్నికలకు ఇప్పుడప్పుడే సిద్ధంగా లేవన్నారు. కాబట్టి కేంద్రంలో ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.

అయితే రానున్న ఎన్నికల్లో అధికారం కోసం పోటీపడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి కచ్చితంగా ఏర్పడుతుందని చెప్పారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని తాము ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామన్నారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఏచూరి పైవిధంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Loading...

More Telugu News