: అందులో కోహ్లీకి తిరుగులేదు
పూర్తి ఫిట్ నెస్ కలిగిన క్రికెటర్లలో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధమ స్థానాన్ని సంపాదించాడు. ద హెల్త్ సైట్.కామ్ నిర్వహించిన సర్వేలో అత్యధికులు విరాట్ కోహ్లీనే అత్యంత శారీరక దృఢత్వం కలిగిన ఆటగాడిగా నిర్ణయించారు. ఈ సర్వేలో 42 శాతం మంది విరాట్ కోహ్లీకి మద్దతు పలికారు. బ్యాటింగ్ సందర్భంగా క్రీజులో పరుగుల వేగం, ఫీల్డింగ్ కదలికలు, బంతి విసిరే వేగం వంటివి పరిగణనలోకి తీసుకుని ఫిట్ నెస్ ను నిర్ధారించారు. ఇందులో 42 శాతం మంది కోహ్లీనే ఎంచుకున్నారు. ధోనీ, గేల్ లు 13 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచి ఫర్వాలేదనిపించారు.