: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 30 మంది ఆటగాళ్లతో బీసీసీఐ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించింది. ఈ సారి కూడా వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు దక్కలేదు. అలాగే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లను కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్, ఢిల్లీకి చెందిన ఉన్మక్త్, ధోని, మురళి, విజయ్ శిఖర థావన్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోంచే బీసీసీఐ తుది జట్టును ఎంపిక చేస్తుంది.