: స్మృతి ఇరానీ విద్యార్హతపై వివాదం


కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ అప్పుడే ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల్లో రెండు సార్లు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె వేర్వేరు విద్యార్హతల వివరాలను పేర్కొనడమే ఇప్పుడు వివాదం అవుతోంది. 2004 ఎన్నికల సమయంలో ఇరానీ ఎన్నికల అఫిడవిట్లో తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం నుంచి బీఏ పూర్తి చేశానని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం ద్వారా బీకామ్ ప్రథమ సంవత్సరం మాత్రమే చదివినట్లు పేర్కొన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించగా, వారు 2000 సంవత్సరం కంటే ముందునాటి రికార్డులు లేవని చెబుతున్నారు. ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

  • Loading...

More Telugu News