: ఊపిరున్నంత వరకు ఆ ఇద్దరి ఆశయాల కోసం పాటుపడతా: కొడాలి నాని


ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు నందమూరి తారకరామారావు, మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డిల ఆశయాల సాధనకు పాటుపడతానని వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందజేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News