: అటార్నీ అందాన్ని పొగిడి, ఆనక 'ఓ...భామా...!'అని తలపట్టుకున్న ఒబామా
ప్రజల మనసులు గెలుచుకుని.. రెండోదఫా అమెరికా అధ్యక్షుడిగా అందలమెక్కిన బరాక్ ఒబామా కళాదృష్టి.. రసజ్ఞత అందరికీ తెలిసిందే. ఈ అంశం గురించి ఓ పరి మీడియా కోడైకూసి రచ్చ రచ్చ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే, అందాన్ని ఆస్వాదించడంలో ఒబామా రూటే.. సపరేటు, అది ఆడవాళ్ల అందమైనా, ప్రకృతి అందాలైనా..!
ఇదేకోవలో తాజాగా ఒబామా కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమల హర్రీస్ అందాన్ని మనస్పూర్తిగా పొగిడేశాడు. అబ్బో.. ఆమె అందం సూపరు..డూపరంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. అమెరికాలో ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో ఒబామా, హర్రీస్ ని పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే అమెరికా అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిపై మీడియా,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు హర్రీసన్ కు క్షమాపణలు చెప్పాడు. ఈమేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన సైతం విడుదల చేశాయి.
ఎంత చిక్కొచ్చిపడిందీ... అందం పొగిడితే పాపమా... ఓ...భామా... అంటూ ఒబామా తలపోస్తున్నాడేమో...కదా..!