: 2018 నాటికి 40 కోట్లకు ట్విట్టర్ యూజర్లు
ట్విట్టర్ యూజర్ల సంఖ్య 2018 నాటికి 40 కోట్లకు చేరుకుంటుందని 'ఈ మార్కెటర్' అనే సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ ను వాడే వారి సంఖ్య సుమారు 25 కోట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఆసియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూజర్లు పెరుగుతారని 'ఈ మార్కెటర్' అంచనా వేసింది. అదే సమయంలో ట్విట్టర్ కు ప్రధాన మర్కెట్లుగా ఉన్న అమెరికా, జపాన్ లో మాత్రం యూజర్లు వరుసగా 6.4, 6.1శాతం తగ్గుతారని వెల్లడించింది.