: గూగుల్ కారుకు స్టీరింగ్, బ్రేకులు ఉండవు!


డ్రైవర్ రహిత కారు తయారీ కోసం ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పనిచేస్తోంది. ఇది ఎలా ఉంటుందో కొన్ని ఆసక్తికరమైన వివరాలను కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో రానున్న గూగుల్ కారును డ్రైవింగ్ చేసే శ్రమ లేకుండానే సీటులో హాయిగా రిలాక్సయి కళ్లు మూసుకుని గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఎందుకంటే దీనిలో స్టీరింగ్ ఉండదు. ఇక యాక్సిలరేటర్, బ్రేకులు కూడా ఉండవని... సాఫ్ట్ వేర్ తో కూడిన సెన్సర్లే అన్ని పనులు చేసేస్తాయని గూగుల్ కారు ప్రాజెక్టు డైరెక్టర్ క్రిస్ ఉర్మ్ సన్ తెలిపారు. ప్రయాణించేందుకు ఓ బటన్ నొక్కితే చాలన్నారు.

ఇందులోని సెన్సర్లు సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వాటిని గుర్తించగలవట, ఏవైనా అడ్డు వస్తే బ్రేకుల్ వాటంతట అవే పడిపోతాయి. అయితే, డ్రైవర్ లేనందున వేగ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లకే గూగుల్ పరిమితం చేస్తోంది. ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి వీలుగా ఇందులో సీటు ఉంటుంది. ఆన్, ఆఫ్ బటన్, వెళుతున్న మార్గాన్ని సూచించే స్క్రీన్ ఉంటాయి. ముందుగా 100 ప్రొటోటైప్ కార్లను తయారు చేయాలని గూగుల్ భావిస్తోంది. అయితే, వీటికి మాత్రం మాన్యువల్ కంట్రోల్స్ ఉంటాయని సమాచారం.

  • Loading...

More Telugu News