: రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. విభజన నేపథ్యంలో మొదట 18 మంది రాజ్యసభ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ కు 11, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తన కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. దీనిపై ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంపిక నిర్ణయం వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నెల 30 సాయంత్రం 4 గంటలకు ఎంపీల విభజనపై మళ్లీ డ్రా తీస్తారు.