: ఘనంగా బీజేపీ 33వ వ్యవస్థాపక దినోత్సవం


భారతీయ జనతా పార్టీ 33వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్, బర్కత్ పురలోని గ్రేటర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్ లో నేడు అట్టహాసంగా నిర్వహిస్తున్న వేడుకలకు జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్న కార్యక్రమంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి జగదీష్ భవసర్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News