: నల్లధనాన్ని తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలి: చంద్రబాబు
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు సిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు.
గండిపేటలో జరుగుతోన్న మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ... నేతలు, కార్యకర్తలు తాము సంపాదించిన దాంట్లో ఒక్క శాతాన్ని పార్టీ కోసం ఇవ్వగలిగితే పార్టీలో నిధుల కొరత ఉండదని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.