: ఎన్టీఆర్ సేవలను మహానాడులో స్మరించిన మురళీమోహన్
ఒక్క అవకాశం ఎప్పుడిస్తారా? అని నిర్మాతలు క్యూ కట్టి మరీ, ఎదురుచూస్తున్న రోజుల్లో ... నందమూరి తారకరామారావు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం రాజకీయాల్లోకి వచ్చారని నటుడు మురళీ మోహన్ అన్నారు. మహానాడులో ఈ రోజు ఆయన మాట్లాడారు. తెలుగువారిని మదరాసీలుగా గుర్తిస్తున్న సమయంలో... తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్న రోజుల్లో... ఎన్టీఆర్ ముందుకు వచ్చి తెలుగువారి శక్తిని దేశ ప్రజలకు, ప్రపంచానికి చాటి చెప్పారని చెప్పారు.