: నేడు ఢిల్లీలో కమలనాథన్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఆప్షన్లు తదితరాలతో కూడిన మార్గదర్శకాలపై చర్చించేందుకు కమలనాథన్ కమిటీ ఈ రోజు ఢిల్లీలో భేటీ కానుంది. ఇదిలావుండగా, జూన్ 2న ఉద్యోగులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో విధులకు హాజరుకావాలని కోరేందుకు సీఎస్ మహంతి రేపు (గురువారం) ఇరు ప్రాంతాల ఉద్యోగులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పనిచేయడానికి వీలులేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కరాఖండిగా చెబుతున్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి దీనిపై వాస్తవ పరిస్థితిని వారికి వివరించనున్నారు. ఇప్పుడు చేస్తున్న కేటాయింపులన్నీ సర్దుబాట్లు మాత్రమేనని, కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఉద్యోగులను ఈ సమావేశంలో సీఎస్ కోరనున్నారు.