: టీడీపీ మహానాడులో నేటి కార్యక్రమాల వివరాలు


తెలుగుదేశం పార్టీ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 33వ మహానాడులో రెండో రోజైన ఈ రోజు జరగనున్న కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* ఉదయం 9.30 గంటలకు తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారు.
* 10.30 గంటలకు ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేస్తారు.
* 11 గంటల నుంచి తీర్మానాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం, ఈ సమయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
* 4 గంటలకు సంస్థాగత విషయాలపై చర్చ మొదలవుతుంది.
* 4.30 గంటలకు రాజకీయ తీర్మానం చేస్తారు.
* 5 గంటలకు 'భారత విదేశాంగ విధానం-తెలుగుదేశం పాత్ర'పై చర్చ ఉంటుంది.
* 5.30 గంటలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముగింపు సందేశమిస్తారు.
* ఇక చివరిగా సాయంత్రం 6 గంటలకు జరగనున్న సాంస్కృతిక కార్యక్రమాలతో మహానాడు ముగుస్తుంది.

  • Loading...

More Telugu News