: టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించిన చంద్రబాబు
టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించారు. 2019లో జాతీయ పార్టీగానే పోటీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. గండిపేటలో జరుగుతోన్న మహానాడులో టీడీపీ నేతలు, కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు తెలంగాణలోనే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతి హక్కులను కాపాడుతామని, తెలుగు వారి అభివృద్ధి కోసం పాటుపడతామని ఆయన చెప్పారు.