: కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి
సినీ నటి హంసా నందిని ప్రయాణిస్తున్న కారు సోమవారం రాత్రి మహబూబ్ నగర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. కడప పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొని, హైదరాబాదుకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బారికేడ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హంసానందిని, ఆమె డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.