: భయపెట్టడం, ప్రలోభపెట్టడం బాబుకు సరికాదు: మేకపాటి
సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ నేతలను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం మంచి సంప్రదాయం కాదని వైఎస్సార్సీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎస్పీవై రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకోవాలని అన్నారు. బాబు హామీలపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మేకపాటి చెప్పారు. ఎంపీ బుట్టా రేణుక వ్యవహారంలో జరిగినవన్నీ చాలా దురదృష్టకరం అని ఆయన అభిప్రాయపడ్డారు.