: రాజపక్సేతో మోడీ సమావేశం
మిత్ర పక్షాల నిరసనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేతో ఢిల్లీలో భేటీ అయ్యారు. రాజపక్సేను ప్రమాణ స్వీకారానికి అహ్వానించవద్దని ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే తదితర మిత్ర పక్షాలు మోడీని కోరిన సంగతి తెలిసిందే. అయినా, ఆయన రాజపక్సేను ఆహ్వానించారు. మోడీ అంతకు ముందు మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ తో, అఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ తోనూ సమావేశమయ్యారు.